నోట్లో గంగాజలం పోశారు.. చచ్చిన వ్యక్తి బతికొచ్చాడు!

-

అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చితిపై మృతదేహం కూడా ఉంచారు. ఇక దహన సంస్కారాలు చేయడమే తరువాయి. కానీ, చితిపై ఉంచిన వృద్ధుడు కళ్లు తెరవడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన ఢిల్లీ సమీపంలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

ఢిల్లీకి చెందిన సతీష్ భరద్వాజ్(62) క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల హాస్పిటల్‌లో చేరారు. సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందినట్లు ఏకంగా 11 మంది వైద్యుల బృందం ధ్రువీకరించింది. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చితికి నిప్పంటించే ముందు నోట్లో నీళ్లు పోశారు. ఒక్కసారిగా కదలిక వచ్చిన వృద్ధుడు కళ్లు తెరిచాడు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడాడు కూడా. ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు అంబులెన్సుకు సమాచారం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news