సైబ‌ర్ నేరం.. క్రెడిట్ కార్డు నుంచి ల‌క్ష మాయం

-

స్మార్ట్ ఫోన్లు వ‌చ్చిన నాటి నుంచి సైబ‌ర్ నేరాలు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. సైబ‌ర్ నేరాలు ఎన్నీ జ‌రిగినా.. వాటికి అడ్డుక‌ట్ట వేయ‌డం సాధ్య ప‌డ‌టం లేదు. చాలా మంది ఈ సైబ‌ర్ నేర‌గాళ్ల చేతులలో మోస పోతున్నారు. తాజా గా హైద‌రాబాద్ లోని బాలా న‌గ‌ర్ ప‌రిధిలో మ‌రో సైబ‌ర్ నేరం జ‌రిగింది. రివార్డు పాయింట్ల ఆశ చూపి ఒక యువ‌కుని అకౌంట్ నుంచి రూ. 1.11 ల‌క్ష‌లను సైబ‌ర్ నేర‌గాళ్లు కాజేసారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బాలా న‌గ‌ర్ లోని ఐడీపీఎల్ కు చెందిన సుభాష్ అనే యువ‌కుడు వ‌ద్ద‌ ఒక బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు ఉంది. అయితే అత‌ని వ‌ద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ కు సైబ‌ర్ నేర‌గాళ్లు ఇక లింక్ ను పంపారు. ఈ లింక్ ను క్లిక్ చేస్తే రివార్డ్ పాయింట్లు వ‌స్తాయ‌ని ఆశ చూపారు. దీంతో సుభాష్ త‌న స్మార్ట్ ఫోన్ లో లింక్ ను క్లిక్ చేసి క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను న‌మోదు చేశాడు. దీంతో అత‌ని ఖాతా నుంచి రూ. 1.11 ల‌క్ష‌లు మాయం అయ్యాయి. దీంతో మోస పోయాన‌ని గ్ర‌హించి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సైబ‌ర్ నేర‌గాళ్లు ఏ విధంగా అయినా మ‌న అకౌంట్ లో నుంచి డ‌బ్బుల‌ను కాజేస్తారు. కాబ‌ట్టి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలి

Read more RELATED
Recommended to you

Latest news