ఏపీ డేటా లీక్ స్కామ్.. ముదురుతున్న వివాదం..!

-

ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాల లబ్ధి దారుల పేర్లు, వారి వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి దొంగలించి ఐటీ గ్రిడ్స్ కంపెనీకి అప్పగించింది. ఆ డేటాను ఐటీ గ్రిడ్స్ కంపెనీ.. సేవా మిత్ర యాప్ లోకి అప్ లోడ్ చేసింది. ఆ డేటాను అనలైజ్ చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ల ఓట్లను తొలగిస్తున్నారు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతుండటమే కాదు.. రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాయి. దేశమంతా ఎన్నికలు జరుగుతున్నా.. ఏపీలో మాత్రం రసవత్తరంగా మారాయి. నిన్నటి వరకు అందరూ పుల్వామా దాడి, బాలాకోట్ దాడిపై చర్చించుకున్నా.. తాజాగా దేశమంతా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ కూడా ఏపీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా… మరోవైపు ఏపీలో డేటా లీక్ వివాదం ముదురుతోంది.

AP data leak scam, controversy aggravated

ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే.. ఈ వివాదం ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ రగులుకున్నది. ఎందుకంటే.. ఏపీ ప్రజల డేటాను దొంగలించిన కంపెనీ ఉన్నది తెలంగాణలో. దీంతో డేటా లీక్ వివాదం కాస్త తెలంగాణ, ఏపీ మధ్య నలుగుతోంది.

అది చివరకు ఎక్కడి వరకు వెళ్తుందనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఏపీ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారని.. అక్కడి నుంచి ఆ డేటాను సేవా మిత్ర అనే టీడీపీకి చెందిన యాప్ లో అప్ లోడ్ చేశారని.. దాని ద్వారా వైసీపీకి చెందిన సానుభూతిపరుల ఓట్లను తీసేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు టీడీపీ.. వైసీపీపై ఆరోపణలు చేస్తోంది. కావాలనే సేవా మిత్ర యాప్ లో ఉన్న టీడీపీ కార్యకర్తల డేటాను టీఆర్ఎస్ పార్టీ సాయంతో వైసీపీ దొంగలించి… టీడీపీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తూ.. వాళ్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తోంది అంటూ టీడీపీ ఆరోపిస్తుంది.

అయితే.. ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం అనేది పక్కన బెడితే.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చింది లోకేశ్వర్ రెడ్డి అనే ఓ విజిల్ బ్లోయర్ ద్వారా. ఆయన తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ కార్యకర్తలు ఏపీలోని ఓటర్ల లిస్టును సేకరించి.. టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తున్నారు. సేవా మిత్ర అనే యాప్ ను ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాల లబ్ధి దారుల పేర్లు, వారి వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి దొంగలించి ఐటీ గ్రిడ్స్ కంపెనీకి అప్పగించింది. ఆ డేటాను ఐటీ గ్రిడ్స్ కంపెనీ.. సేవా మిత్ర యాప్ లోకి అప్ లోడ్ చేసింది. ఆ డేటాను అనలైజ్ చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ల ఓట్లను తొలగిస్తున్నారు.. అంటూ లోకేశ్వర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ పోలీసులు.. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. కంపెనీ ఎండీ మాత్రం పరారీలో ఉన్నాడు. అయితే తెలంగాణ పోలీసులు కేవలం విచారణ చేస్తున్నా.. దానిపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడటం.. టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని ఇదంతా చేస్తోందని ఆరోపించడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించడం.. విచారణ జరుగుతుంటేనే చంద్రబాబు భయపడటం దేనికి? తన దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని ముందే భయపడుతున్నారా? అంటూ ప్రశ్నించడం.. మధ్యలో లోకేశ్ బాబు రావడం.. ఓ రకంగా చెప్పాలంటే ప్రెస్ మీట్ ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వీళ్ల మధ్య ఓ వార్ నడుస్తోందనే చెప్పాలి. చూద్దాం.. ఇది ఎంతవరకు పోతుందో?

Read more RELATED
Recommended to you

Latest news