యూత్ ను చెడగొట్టే ఇలాంటి సినిమాలు బ్యాన్ చేయాలి..!

5

ఎలాంటి సినిమా అయినా సరే ఆడియెన్స్ ను అలరించడమే కదా అని కొంతమంది హద్దులు దాటి వెళ్తుంటారు. ఒకప్పుడు బీ గ్రేడ్ సినిమాలకే ఇప్పుడు అడల్ట్ కామెడీ అంటూ డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వచ్చేవి కాని ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి వచ్చాయి. బూతు బాగోతంతో వచ్చే సినిమాల సంఖ్య పెరిగిపోయింది.

రీసెంట్ గా తమిళంలో అలాంటి అడల్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమా 90 ML. బిగ్ బాస్ తమిళంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఓవియా ప్రధాన పాత్రలో ఓ ఐదుగురు అమ్మాయిలు కలిసి మందు, సిగరెట్ వంటివి తాగడం పచ్చిగా మాట్లాడటం వంటివి ఉన్నాయి. ఈమధ్యనే తమిళంలో రిలీజైన ఈ సినిమా అక్కడ మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగు వర్షన్ కు సంబందించిన ట్రైలర్ కూడా వచ్చేసింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ నాయకులు 90 ML సినిమా మీద చెన్నై కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలని ఇలాంటి సినిమాలు చూడటం వల్లే రేపులు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చాక పోలీసులు అడ్డుకోవడం అసంభవం. మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

amazon ad