బాయ్స్ మధ్య అమ్మాయిలు ఆ గీత గీసుకోవాలి…వివాదాస్పదంగా జేఎన్యూ సర్క్యులర్..!

-

అమ్మాయిలు మగ వాళ్ళతో ఎలా మెలగాలో ఢిల్లీ లోని జే ఎన్ యూ విశ్వవిద్యాలయం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ సర్క్యులర్ ఇప్పుడు వివాదాస్పదం గా మారింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు కూడా దీనిపై మండిపడుతున్నాయి. జేఎన్యూ వెబ్ సైట్ లో అమ్మాయిలు లైంగిక వేధింపుల నుండి ఎలా బయటపడాలో చెబుతూ సర్క్యులర్ ను వెబ్ సైట్ లో పెట్టారు.

అబ్బాయిలు కొన్ని సార్లు అనుకోకుండా కొన్నిసార్లు ఉద్దేశ్య పూర్వకంగా స్నేహపూర్వక పరిహాసానికి లైంగిక వేధింపులకు మధ్య ఉన్న సన్నని గీత దాటుతారని ఎలాంటి వేధింపులకు దూరంగా ఉండేందుకు అమ్మాయిలు తమకు తమ మగ స్నేహితులకు మధ్య ఒక స్పష్టమైన గీత ఎలా గీయాలో తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇక ఈ సర్క్యులర్ ను తాజాగా స్త్రీ విద్వేశిత సర్క్యులర్ అంటూ రేఖ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సలహాలు అమ్మాయిలకే ఎందుకు ఇస్తారు…ఇలాంటి వాటికి పాల్పడుతున్న అబ్బాయిలకు ఎందుకు ఇవ్వరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news