బిహార్‌లో దారుణం.. సిలిండ‌ర్ పేలి ఐదుగురు చిన్నారులు మృతి

-

బిహార్ రాష్ట్రలోని బాంకా జిల్లాలో గ‌ల ర‌జౌన్ దారుణం చోటు చేసుకుంది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఐదుగురు చిన్న పిల్ల‌లు మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఐదుగురు చిన్న పిల్ల‌లు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో ఆ ఐదుగురు చిన్న పిల్ల‌లు కుటుంబం క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. కాగ ఆ ఐదుగురు చిన్న పిల్లలు ఆట ఆడుతూ వంట ఇంట్లోకి వెళ్లిన క్ర‌మంలో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది.

దీంతో అక్క‌డ ఉన్న ఐదుగురు చిన్న పిల్లలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స్థానికుల పోలీసులు స‌మాచారం ఇవ్వ‌డంతో.. పోలీసులు ఘ‌టనా స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కాగ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ ఎలా పేలింది అనే విష‌యం తెలియాల్సి ఉంది. పోలీసులు గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డానికి గ‌ల కార‌ణాల గురించి విశ్లేసిస్తున్నారు. కాగ ఒకే కుటుంబంలో ఐదుగురు చిన్న పిల్లలు ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news