టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మొదట్లో శ్రీకారం సినిమాతో ముందుకు వచ్చిన శర్వానంద్.. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన… మహా సముద్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పర్వాలేదనిపించాడు. అలాగే… ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే.. శర్వానంద్ హీరోగా శ్రీకార్తీక్ డైరెక్షన్‌లో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ఈ మూవీలో హీరోయిన్‌గా పెళ్లి చూపులు ఫేం.. రీతూ వర్మ నటిస్తోంది. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి అమల గారు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజరు ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ లో ప్రియ దర్శి, హీరో శర్వానంద్ అదరగొట్టారు. టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.