ఓమిక్రాన్ బాధితుల్లో ఆ లక్షణాలు… కొద్ది మందిలోనే ఉన్నాయంటున్న ఢిల్లీ వైద్యులు.

-

ఓమిక్రాన్ కేసులతో ఇండియా కలవరపడుతోంది. ఇప్పటికే ఇండియాలో కేసుల సంఖ్య వేయికి చేరువైంది. మరోవైపు ఓమిక్రాన్ భయంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకపై నిషేధాన్ని విధిస్తున్నాయి అయితే తాజాగా ఇండియాలో 961 కేసులు నమోదైతే.. 300 పైగా బాధితులు కోలుకున్నారు. ఇలా కోలుకుంటున్న వారిలో ఎక్కువగా లక్షణాలు లేకుండా ఉన్నాయని తెలుస్తోంది.

తాజాగా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం ఓమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా లక్షణాలు ఏమి ఉండటం లేదన్నారు. చాలా మందికి లక్షణాలు లేకుండానే ఓమిక్రాన్ సోకుతుందని వెల్లడించారు. డిసెంబర్ 30 వరకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో 70 మంది చేరితే 50 మంది త్వరగానే కోలుకున్నారని… వారిలో ఎటువంటి లక్షణాలు లేవని.. వైద్యులు తెలిపారు. కేవలం నలుగురు పేషెంట్లు మాత్రమే వివిధ రకాల లక్షణాలతో బాధపడ్డాని తెలిపారు. వీరిలో తేలికపాటి జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్, బలహీనత, లూజ్ మోషన్ ఉన్నాయని ఎల్ఎన్జేపీ ఎండీ సురేష్ కుమార్ తెలిపారు. కేవలం పారసెటిమల్, మల్టీవిటమిన్ మాత్రలతోనే ఓమిక్రాన్ తగ్గిందని గతంలో వైద్యులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news