మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై లోని బృహాన్ ముంబయి కార్పొరేషన్ పరిధిలో ఉన్న 500 చదరపు అడుగుల లోపు ఇండ్లకు అన్నింటికీ ఆస్తిపన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది పేదలకు మేలు జరగనుంది.
అంతే కాకుండా ఇంటి టాక్స్ రద్దు చేయడం వల్ల ప్రభుత్వం 468 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది అని పట్టణ అభివృద్ది శాఖ మంత్రి ఏక్ నాథ్ శిండే వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని దాని ద్వారా రాష్ట్రం లోని పేదలు అందరికీ లబ్ది జరుగుతుంది అని ప్రజలు భావిస్తున్నారు. మరి దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.