కరోనా కేసులు తో పాటు ఒమీక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం మరోమారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రవాణా ఆంక్షల అమలు పొడగిస్తూ… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీవో జారీ చేశారు.
ఈ నెల పదవ తారీకు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు రాజకీయ కార్యక్రమాలపై నిషేధం విధించారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో రాష్ట్రంలో కరవు పరిస్థితులపై నిన్న సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోడి నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను కఠినంగా అమలు సీఎస్ సోమేశ్… ఎక్కువ మంది జనాలు గుమిగూడే సభలు, సమావేశాలు ఈనెల 10వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలని పేర్కొన్నారు.