BREAKING : ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ విధింపు

-

మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు, ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు 10 వేలకు తక్కవగా నమోదు అయిన కరోనా కేసులు.. ఇప్పుడు 40 వేలకు చేరువలో నమోదు అవుతున్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీ లోనూ ఈ కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ విధిస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో శ‌ని, ఆదివారాల్లో పూర్తి క‌ర్ఫ్యూ విధింస్తూ నిర్ణయం తీసుకుంది ప్ర‌భుత్వం. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ఢిల్లీ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే… ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అవ‌కాశం క‌ల్పించిన స‌ర్కార్‌… కరోనా రూల్స్‌ కూడా కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా… ఇవాళ ఉదయమే ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా మహమ్మారి భారీన పడ్డారు. కరోనా పాజిటివ్‌ రావడంతో… హో ఐసోలేషన్‌ కు వెళ్లారు సీఎం కేజ్రీవాల్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news