ఇది రాజరిక పాలన కాదు… 2023 తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు- ఈటెల రాజేందర్.

-

బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకే.. అధికారులు ప్రవర్తిస్తున్నారు తప్పితే.. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించలేదని అన్నారు. ఈ ఘటనలకు కారణం మొట్టమొదటి దోషి కేసీఆరే అని స్పష్టం చేశారు. స్థానికత ఆధారంగా తెలంగాణలో ఉద్యమాలు జరిగాయి… అయినా ప్రస్తుత ఉద్యోగ బదిలీల్లో ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. పోలీసులు నిచమైన స్థితికి దిగజారారని ఆయన విమర్శించారు. హోంగార్డ్ నుంచి కానిస్టెబుల్, ఎస్పై విధులను కూడా పోలీస్ కమీషనరే నిర్వహించారని ఎద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఏమి ఉందడు.. ఇదేం రాజరికం కాదని.. తండ్రి తర్వాత కొడుకు, తరువాత మనవడు అధికారంలోకి రావడానికి అని అన్నాడు. 2023 వరకే టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చారని.. ఆ తరువాత ఖచ్చితంగా అధికారంలోకి రాదని కుండబద్దలు కొట్టారు. మాపై కేసులు పెట్టినా పర్వాలేదని… ఉద్యోగులును ఇబ్బంది పెట్టకుండి అని సీఎంను డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రైతాంగం, కార్మికులు, ఆర్టీసీ ఎంప్లాయిస్, నిరుద్యోగులపై దాడులు చేయిస్తున్నారు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news