సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టమని.. 30 నెలల పాలనలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని నిప్పులు చెరిగారు. కరోనా వల్ల ప్రపంచం నష్టపోయింది.. జగన్ పాలన వల్ల ఏపీ నష్టపోయిందని ఆగ్రహించారు. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని చురకలు అంటించారు. జగనుకు తాను తప్ప ఎవ్వరూ అక్కర్లేదు.. చెల్లి లేదు.. తల్లి లేదని నిప్పులు చెరిగారు.
విభజన కంటే ఎక్కువగా జగన్ పాలన వల్ల ఏపీ నష్టపోయిందని… రాధాపై రెక్కీ చేస్తే ఆధారాల్లేవన్నారన్నారు. పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇస్తే ఏం చర్యలు తీసుకున్నారు..? అని నిలదీశారు. డీజీపీ గౌతమ్ సవాంగుకు సన్మానం చేయాలని… గౌతమ్ సవాంగ్ డీజీపీ పదవికి అనర్హుడని ఫైర్ అయ్యారు. కొందరు ఐఏఎస్సులు.. ఐపీఎస్సులు వెన్నముక లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని కేంద్రీకృతం చేశారని.. పారదర్శకత పాలన అంటూ జీవోలని దాచేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తున్నారు కాబట్టే జగన్ జీవోలను దాచి పెడుతున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు.