కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా : కేబినెట్ కీలక నిర్ణయం

-

ఇండియాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కేసులు పెరగడంతోపాటు మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మృతి చెందిన బాధితులను ఆదుకునేందుకు నడుము కట్టింది. కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీహార్ సర్కార్.

ఇవాళ కరోనా మహమ్మారి కస్టడీపై భేటీ అయిన బీహార్ కేబినెట్… ఈ సందర్భంగా కరణం కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. బీహార్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై.. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు… 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news