దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఢిల్లీలోనే ఎక్కువశాతం కరోనా మహమ్మారి కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీలో థర్డ్ వేవ్ మొదలైందని.. ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
ఇవాళ ఒక్క రోజే 10 వేల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది ఆరోగ్యశాఖ. ఢిల్లీలో 8.37 శాతానికి కరోనా పాజిటివ్ రేటు పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాబట్టి ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ… జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.
మాస్కులు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది ఢిల్లీ ఆరోగ్యశాఖ.కాగా గడిచిన 24 గంటలలో… దేశ రాజధాని ఢిల్లీలో 5481 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటి వరకూ ఢిల్లీలో 25 వేల మందికి పైగా కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను అలర్ట్ చేసింది ఢిల్లీ సర్కార్.