దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తు అలర్ట్ చేస్తున్నారు. తాజా గా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వర్చవల్ గా అయ్యే ఈ సమావేశంలో ముఖ్యం గా కరోనా పరిస్థితుల పై రాష్ట్రాల నుంచి సమాచారం తెలుసుకోనున్నారని తెలుస్తుంది. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో దీని పై కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
రాష్ట్రాల పై ఓమిక్రాన్ ప్రభావం ఎంత వరకు ఉంది అని ముఖ్య మంత్రులను పీఎం మోడీ అడిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే కరోనా, ఓమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుసుకోనున్నారు. అలాగే ఆయా రాష్ట్రాలల్లో అమలు అవుతున్న ఆంక్షల గురించి సైతం పీఎం మోడీ తెలుసుకోనున్నారు. అయితే వర్చువల్ మీటింగ్ లో లాక్ డౌన్ పై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.