శ్రీలంక క్రికెట్ కు మరో షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ జట్టు ఆటగాడు ధనుష్క గుణతిలక తాజా గా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ లేటర్ ను శ్రీలంక క్రికెట్ బోర్డుకు కూడా సమర్పించాడు. టెస్టులకు గుడ్ బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్ పై దృష్టి పెడుతానని ధనుష్క గుణతిలక తెలిపారు. కాగ ధనుష్క గుణతిలక గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో కరోనా బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘిచాడు. దీంతో అతని శ్రీలంక బోర్డు నిషేధం విధించింది. కాగ ధనుష్క గుణతిలక చివరి టెస్టు ను రెండు సంవత్సరాల ముందు ఆడాడు.
అలాగే ఇప్పటి వరకు ధనుష్క గుణతిలక ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడాడు. ఇదీల ఉండగా కొద్ది రోజుల క్రితం శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన భనుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా గా ధనుష్క గుణతిలక కూడా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే శ్రీలంక క్రికెట్ లో వరుసగా రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంక బోర్డు ఇటీవల ఫిట్ నెస్ టెస్టు కఠినంగా అమలు చేస్తుంది. కేవలం 8.10 నిమిషాల్లో ఏకంగా రెండు కిలో మీటర్లు పరుగెత్తాలని నిబంధన పెట్టింది. దీన్ని ఇప్పటి కే చాలా మంది ఆటగాళ్లు బహిరంగంగానే వ్యతిరేకించారు.