రోజంతా కీబోర్డ్ ​పైనే పని చేస్తారా?అయితే వేళ్లతో ఈ వ్యాయామం చేయండి

-

రోజంతా వేళ్లతో ఎన్నో పనులు చేస్తాం. స్టీరింగ్ తిప్పుతూ కారు నడుపుతారు, ఇక ఆఫీస్ లో కీబోర్డ్ నొక్కుతాం. ఇలా చేసి చేసి వేళ్లు అలసటకు గురువుతాయి. కొన్నిసార్లు అసలు కీబోర్టులో టైప్ చేయటం కూడా మన వల్ల కాదు. వేళ్లు సహకరించవు. కండరాలు బలహీనపడి చేతి బిగువు తగ్గిపోవచ్చు. అయితే కొన్ని వ్యాయామాలతో ఇలాంటి ఇబ్బందులు నుంచి ఉపసమనం పొందవచ్చు. వీటితో వేళ్ల కదలికలు మెరుగవుతాయి. నొప్పులూ తగ్గుముఖం పడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఒకో వ్యాయామాన్ని రెండు చేతులతోనూ కనీసం నాలుగు సార్లు చేయాలి గుర్తుంచుకోండి.

వేళ్ల సాగదీత

అరచేయిని టేబుల్ మీద ఆనించి..చేతి మధ్యభాగం టేబుల్ కు తాకకుండా కాస్త పైకి లేపండి.
నెమ్మదిగా వేళ్లను ముందుకు సాగదీయండి
కాసేపు అలానే ఉంచి తీసేయండి

పిడికిలి బిగింపు

మిగతా వేళ్ల మీదుగా బొటనవేలును పోనిస్తూ పిడికిలి బిగించండి.
పిడికిలిని కాసేపు అలానే గట్టిగా పట్టి ఉంచండి
తర్వాత వేళ్లను వీలైనంత వెడులుప్గా సాగదీయండి.

పంజా బిగింపు

అరచేయిని మీ వైపు తిప్పుకోని.పంజా మాదిరిగా..మొదళ్లను తాకేలా అన్ని వేళ్లను వంచాలి.
కొద్ది సెకండ్ల వరకు అలానే ఉంచి, వేళ్లను వదులుగా చేయాలి.

పట్టుబలోపేతం

సాప్ట్ బాల్ ను అరచేతిలో పట్టుకుని వీలైనంతవరకూ గట్టిగా నొక్కండి
కొద్దిసేపు గట్టిగా అలానే పట్టుకుని వదిలేయండి.
ఒక చేయితో 10-15 సార్లు చొప్పున వారానికి రెండు మూడు సార్లు చేయండి.
ఒక వేళమీకు బొటనవేలితో ఏదైనా సమస్య ఉంటే చేయకండి.

వేళ్లులేపటం

అరచేతిని పూర్తిగా ఆనేలా టేబుల్ మీద ఉంచాలి.
వసుగా ఒక్కో వేలిని పైకి లేపి కిందకి తేవాలి
అన్నీ వేళ్లను ఒకేసారి పైకి లేపినా ప్లాబ్లమ్ లేదు. అలా ఒక్కో చేయితో 8-12 సార్లు చేయండి

బొటనవేలి సాగదీత

అరచేయిని టేబుల్ మీద ఆనించి, వేళ్ల మొదళ్ల వద్ద.. రబ్బరు బ్యాండును చుట్టుకోవాలి.
నెమ్మదిగా బొటనవేలిని మిగతా వేళ్ల నుంచి దూరంగా జరపండి.
కొద్దిసేపు అలాగే ఉంచి తిరిగి యథాస్థితికి తేవాలి.
ఇలా 10-15 సార్ల చొప్పున వారానికి 2-3 సార్లు చేయాలి.
ఒకరోజు దీన్ని చేశాక మధ్యలో 48 గంటలు తర్వాతే చేయాలి.

వీటితో పాటు మీకు బంకమట్టి దొరికితే అందులో కాసేపు వేళ్లతో ఆడుకున్నా సరిపోతుంది. చిన్నప్పుడు మనం ఆడుకున్నట్లు. అలా చేస్తే మనకు తెలియకుండానే వేళ్లతో చాలా చేస్తాం. ఏవేవో తయారుచేసేవాళ్లం బంకమట్టితో అలా కూడా కుదిరితే చేయండి. ఇంకోటి వేళ్లు నొప్పిగా ఉంటే..గోరువెచ్చటి నీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ వేసి చేతులకు కాపడం పెట్టుకున్నా రిలీఫ్ గా అనిపిస్తుంది. కాయా కష్టం చేసుకునే వాళ్లు ఒళ్లంతా నొప్పులు వస్తాయి. కానీ ఆపీసుల్లో కీబోర్డుతో కుస్తీపడే మనలాంటి వాళ్లకు..వేళ్లే బలం..అవి ఆరోగ్యంగా లేకుంటే..టైపింగ్ చేయలేం. కాబట్టి వేళ్లమీద శ్రద్ద తీసుకోవడం మర్చిపోవద్దు.

                                                                                            -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news