నాని ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌

-

టాలీవుడ్‌ స్టార్‌ న్యాచురల్‌ స్టార్‌ నాని ఫ్యాన్స్‌ కు అదిరిపోయే శుభవార్త. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాను నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే.. జనవరి 21 వ తేదీన అంటే శుక్రవారం రోజు నుంచి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ ప్రకటన తో న్యాచురల్‌ స్టార్‌ నాని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

డిసెంబర్‌ 24 వ తేదీ, 2021 ఏడాదిలో విడుదల అయిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో చాలా విజయ వంతంగా నడుస్తోంది. ఇప్పటికే ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్‌ సీస్‌ లోనూ దుమ్ములేపుతోంది. ఇక ఇప్పటి వరకు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా రూ.50 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం అందుతోంది. కాగా.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా లో హీరోగా నాని నటించగా… మెయిన్‌ హీరోయిన్‌ గా సాయి పల్లవి నటించింది. అలాగే.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, మడన్నా కూడా హీరోయిన్లుగా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news