మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత క్రీడాకారిణి..
తెలుగు తేజం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా 2018 క్రీడల్లో బ్యాడ్మింటన్ ఫైనల్ కు చేరింది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్స్ లో జపాన్ ప్లేయర్ యమగుచిపై 21-17, 15-21,21-10 తేడాతో సింధు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఫలితాం రజత పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు.. స్వర్ణం దీశగా పోరుకు సిద్ధమైంది. తొలి రౌండ్లో పోరాడి గెలిచిన సింధు, రెండో రౌండ్లో గేమ్ కోల్పోయింది. ఆ తర్వాత నిర్ణయాత్మక మూడో రౌండ్లో తన సత్తాను చాటింది . దీంతో ఏషియన్ గేమ్స్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం జరగనున్న ఫైనల్ పోరులో చైనీస్ క్రీడాకారిణి తైజు తో తలపడనుంది.