వాట్సప్ కు సుప్రీం కోర్టు నోటీసులు

-

వాట్సప్ సంస్థకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ వేదికగా ఫేక్ న్యూస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడం, మెసేజింగ్ సేవలు దుర్వినియోగం కావడంతో పాటు వివిధ వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే ఫ్లాట్ ఫాంగా తయారైంది.  దీంతో  భారత్ లో వెళ్లు వెత్తుతున్న ఫిర్యాదుల సేకరణ కోసం ప్రత్యేక అధికారిని నియమించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ  మేరకు నోటీసులు జారీచేసింది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సంస్థను ఆదేశించింది. ఇటీవలే వాట్సప్ సీఈవో క్రిస్ డేనియల్ భారత పర్యటన సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ తో భేటీ సందర్భంగా ఫేస్ బుక్, వాట్సాప్ లో వస్తోన్న తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్ పై పరిష్కారం చూపాలంటూ లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని వారికి వివరించిన సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news