సిల్లీ ఫెలోస్ ట్రైలర్.. కామెడీ కితకితలు..!

-

అల్లరి నరేష్, సునీల్ హీరోలుగా భీమనేని శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సిల్లీ ఫెల్లోస్. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన హిట్ లేని అల్లరి నరేష్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చేసిన సినిమా ఇది. సునీల్ కి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్.

ఇద్దరు హీరోగా స్టాండ్ అవ్వాలంటే సిలీ ఫెల్లోస్ హిట్ కొట్టాల్సిందే. ఇక సినిమా ట్రైలర్ లో ఆస్థి గురించి తెలిసిన హీరోల తండ్రి గతం మర్చిపోవడంతో అతని ద్వారా ఆస్థి తాలూఖా విషయాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, పోసాని ఇలాంటి భారీ స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమా వస్తుంది.

సినిమా ట్రైలర్ ఆద్యంతం అలరించేలా ఉంది. ప్రస్తుతం అల్లరి నరేష్, మహేష్ చేస్తున్న మహర్షి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అందుకే సిల్లీ ఫెల్లోస్ ట్రైలర్ మహేష్ చేతుల మీదగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ అయితే బాగుంది మరి అల్లరోడి ఫేట్ సిల్లీ ఫెల్లోస్ మార్చేస్తుందా లేదా అన్నది చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news