తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు కరోనా ఆంక్షలు పొడగింపు

-

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. రోజుకు 2500 లకు పైగా కరోనా కేసులు పెరిగి పోతున్నాయి. వీటికి తోడు… ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరిగి పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో… గత నెల చివరలో కరోనా ఆంక్షలను విధించింది కేసీఆర్‌ సర్కార్‌.

kcr
kcr

పబుల్‌, రెస్టారెంట్ల, భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం, ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు, సభలకు అనుమతుల నిరాకరణ ఇలా అనేక రకాల ఆంక్షాలను కేసీఆర్‌ సర్కార్‌ జనవరి 10 వ తేదీ వరకు అమలు చేయాలని ముందుగా నిర్ణయం తీసుకుంది. అయితే… ఆ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో… కేసీఆర్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అలాగే పెరుగుతున్న నేపథ్యంలో… కరోనా ఆంక్షలను ఈ నెల 20 వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news