ఆర్జీవీకి పేర్ని నాని షాక్.. చట్టం ప్రకారమే సినిమా టికెట్ల ధరలు!

-

రామ్ గోపాల్ వర్మ తో భేటీ అనంతరం సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1958 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని.. రాం గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారన్నారు. అన్నీ వివరంగా విన్నానని.. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.

కోవిడ్ వల్ల సినిమా హాళ్లలో 50 శాతం మాత్రమే అనుమతని.. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఆర్జీవీ చెప్పిన అంశాలను ఉన్నతస్థాయి కమిటీకి ఇస్తామని.. భారత, ఏపీ సినిమాటో గ్రఫీ చట్టం ప్రకారం ప్రేక్షకులకు టికెట్ ధర ఎంత నిర్ణయం చేయాలో ప్రభుత్వాలు చేస్తున్నాయని వెల్లడించారు. ఇదేదో కొత్తగా జగన్ ప్రభుత్వం చేసింది కాదని.. అందరికి వర్తించే నిబంధనలనే ఇప్పుడు అందరికి గుర్తు చేస్తున్నామన్నారు.

కోవిడ్ కారణంగా ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ లాంటి సినిమాలు వాయిదా వేసుకున్నారని.. సినిమాటో గ్రఫీ చట్టం ప్రకారం రేట్లు జీవో నెంబర్ 35 ద్వారా నిర్దేశించామన్నారు. ఎక్కడా చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకోలేదని.. మళ్ళీ వాటిని రేవైజ్ చేసే అంశంపై హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసామని వెల్లడించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు మంత్రి పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news