వరంగల్ వైద్య కళాశాలలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ మోహన్ దాస్ సహా 26 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మంగళవారం వచ్చిన రిపోర్టుల్లో మరో 15 మందికి కోవిడ్ వచ్చింది. దీంతో మొత్తం ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 41కు చేరింది. మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.