భారత్ బయోటెక్ గుడ్ న్యూస్… డెల్టా, ఓమిక్రాన్ పై సమర్థవంతంగా బూస్టర్ డోస్

-

దేశీయ వ్యాక్సిన్ తయారీ దిగ్గజం భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఓమిక్రాన్, డెల్టా వేరియంట్లను తటస్థీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని సంస్థ తెలిపింది. దేశంలో ప్రస్తుతం రిస్క్ పీపుల్ కు కేంద్రం ప్రికాషనరీ డోస్ లను అందిస్తోంది. మరోవైపు 15-18 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తోంది.

దేశంలో మరోసారి కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గతంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 లోపే ఉండేది. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య లక్షను దాటి రెండు లక్షలకు చేరువ అవుతున్నాయి. ఇండియాలో థర్డ్ వేవ్ వస్తుందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ప్యూలను విధించాయి. ప్రస్తుతం భారత్ బయోటెక్ చెప్పిన వార్తతో ప్రజల్లో ఎంతో కొంత కరోనా భయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news