ఏపీలో విషాదం.. లారీ బోల్తా పడి నలుగురు మృతి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం లో ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం దాచేపల్లి లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఘటనా స్థలంలోనే ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మరో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తమై.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మధ్య కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news