ఇండియాలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే కొత్తగా 2.64 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,64,202 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,018,358 కు చేరింది. అంటే నిన్నటి కంటే కరోనా పాజిటివిటీ రేటు 6.7% ఎక్కువగా నమోదు అయింది. అలాగే రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు 14.78% గా నమోదు అయింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 12,72,073 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా కారణం గా మరణించిన మృతుల సంఖ్య 482,551 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,09,345 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 34,321,803 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5,753 గా నమోదు అయింది.