పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పెరుగును తీసుకునేటప్పుడు మాత్రం ఈ విషయం అసలు మర్చిపోవద్దు. పెరుగు తో పాటు ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే సమస్యలు తప్పవు. అయితే మరి పెరుగుతో పాటు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
పాలు మరియు పెరుగు:
పాలని, పెరుగుని కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండిటినీ కలిపి తీసుకోవద్దు.
పెరుగు మరియు ఉల్లిపాయ:
చాలా మంది పెరుగుతో పాటు ఉల్లిపాయలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలానే రైతా కూడా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల ఎలర్జీలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
పెరుగు మరియు మామిడి:
ఈ రెండింటినీ కూడా కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. కాబట్టి దీనిని కూడా అస్సలు మీరు కలిపి తీసుకోవద్దు.
పెరుగు మరియు చేప:
ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపునొప్పి, వాంతులు మొదలైన సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా పెరుగును తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. వీటిని కలిపి తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.