నిద్రమాత్రలు మింగి ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం!

-

మాలీవుడ్‌ స్టార్‌ నటి భామ సుసైడ్‌ అటెమ్ట్‌ చేసింది. 2017 నాటి నటిపై వేధింపుల కేసును పోలీసులు తిరిగి విచారిస్తుండటంతో భయపడిన… ఆమె ఎక్కువ డోస్‌ నిద్ర మాత్రలు మింగి సూసైడ్‌ కు ప్రయత్నం చేసినట్లు సమాచారం అందుతోంది. తీవ్ర అస్వస్థతతో ఆమె కొచ్చి ఆస్పత్రిలో చేరడం ఈ ఊహగానాలకు మరింత బలం చేకూర్చింది. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు కూడా తెలిపారు.

అయితే.. ఆ వార్తలను భామ కొట్టి పడేసింది. పొరపాటున అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల ఆస్పత్రి లో చేరాల్సి వచ్చిందని భామ పేర్కొంది. తాను ఆత్మహత్యకు యత్నించినట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భామ ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది.తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భామ తన ఇన్‌ స్టాలో స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news