దళితబంధు అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో ఈ పధకం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 100 శాతం గ్రౌండింగ్ చేయాలని పేర్కొంది. స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ఆమోదింపచేయాలని పేర్కొన్నారు.
ప్రతీ లబ్ది దారుడికీ ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని తెలిపారు. లబ్ది దారుడు కోరుకున్న యూనిట్ నే ఎంపిక చేయాలని.. ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షలనుండి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకమని.. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బందుకు రూ. 1200 కోట్ల కేటాయించామని గుర్తు చేసింది.. ఇప్పటికే రూ. 100 కోట్లను విడుదల చేసామని… విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేస్తామని ప్రకటన చేసింది కేసీఆర్ సర్కార్.