అతడితో బ్రేకప్ వల్లే సిల్క్ ఆత్మహత్య చేసుకుందా….?

-

సిల్క్ స్మిత ఈ పేరును ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మూడున్నర దశాబ్దాల కిందట తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసిన అందగత్తెల్లో సిల్క్ స్మిత ఒకరు. తన కళ్ళతో సిల్వర్ స్క్రీన్‌కే మ‌త్తెక్కించేసిన సిల్క్ స్మిత అప్పటివరకు కమర్షియల్ సినిమాల ఫార్ములాకు పూర్తిగా స్వస్తి పలికేసి తన గ్లామర్ తో అందచందాలతో కళ్ళ కవ్వింతలతో వెండి తెరపై మ్యాజిక్ ను క్రియేట్ చేసింది. ఆ కాలంలో బోల్డ్ పాత్రలు చేయడం పెద్ద సంచలనం.

Silk Smitha

కాకపోతే సిల్క్ స్మిత మాత్రం బోల్డ్ పాత్రలు చేయడం మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇలా బోల్డ్ పాత్రలతో, ఐటమ్ సాంగ్ లతో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. సిల్క్ స్మిత తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలుగులో సిల్క్ స్మిత మొదటి సినిమా బండి చక్రం లో తాను పోషించిన సిల్క్‌ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చేసుకుంది.

ఇది ఇలా ఉంటే సిల్క్ ఆత్మహత్య చేసుకోవటానికి అప్పట్లో ఒక సీనియర్ నటుడుతో ఆమె ప్రేమాయణం విఫలం కావడంతో పాటు… ఆ నటుడు సిల్క్ స్మిత మద్యం మత్తులో ఉండగా ఆస్తులన్నీ తన పేరు మీద రాయిం చేసుకున్నాడని… ఆ తర్వాత అతను మోసం చేయడంతోనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని అంటారు. అలాగే సిల్క్ స్మిత సంపాదించిన ఆస్తి అంతా కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఆ తర్వాత ఆమె మద్యానికి బానిస కావడంతో జీవితం చిన్నాభిన్నం అయింది. చివరకు సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా అతి తక్కువ కాలంలోనే వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే.

Read more RELATED
Recommended to you

Latest news