ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారీన పడి చాలా మంది మరణిస్తూన్నారు కూడా. ఇక ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… జగన్ మోహన్ రెడ్డి… కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఒకే చోటు గుమిగుడా కుండా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది సర్కార్.
పాఠశా గదులను, ఆవరణను ఎప్పటి కప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాధికారులు జిల్లా వైద్యాధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని.. విద్యార్థులు కానీ… ఉపాధ్యాయులు కానీ కరోనా బారీన పడితే వెంటనే చికిత్స అందించేలా చూడాలని పేర్కొంది. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపింది.