వైఎస్సార్ టీపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ షర్మిల.. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరమని.. ఉద్యోగాలు రావడంలేదంటూ సాగర్ లాంటి ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగభృతి అని హామిఇఛ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు అని ఫైర్ అయ్యారు.
తెలంగాణ కోసం ఎంతమందైతే ఆత్మబలిదానాలు చేసుకున్నారో ఇప్పుడు నోటిఫికేషన్లు రావడంలేదంటూ అంతమంది చనిపోతున్న పాలకుల్లో చలనం లేదని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవాలనే చట్టం ఉంటె బాగుండన్నారు వైఎస్ షర్మిల.. తెలంగాణాలో ఏ ఒక్కరు సంతోషంగలేరని.. పోలీసుల్ని పనోళ్ళగా వాడుకుంటున్నారని ఆగ్రహించారు. పాలక పక్షానికి ఒకలాగా ప్రతిపక్షాలకు మరోలా రూల్స్ ఉండటం భావ్యం కాదని పేర్కొన్నారు వైఎస్ షర్మిల..