జిల్లాలు వ‌చ్చిన‌ట్టే.. మూడు రాజ‌ధానులు వ‌స్తాయి : మంత్రి అవంతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని అన్నారు. 26జిల్లాలు ఏవిధంగా వచ్చాయో మూడు రాజధానులు కూడా అదే విధంగా వస్తాయని అన్నారు. అలాగే విశాఖపట్నం ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా త‌మ ప్ర‌భుత్వం చేస్తుంద‌ని స్పష్టం చేశారు. అలాగే విభ‌జించిన జిల్లాల‌ను అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

జిల్లాల విభ‌జ‌న‌కు అన్ని వ‌ర్గాలు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. కాగ కొత్త జిల్లాల ఏర్పాటుకు టీడీపీ అనుకులమా.. వ్యతిరేకమా ప్ర‌క‌టించాల‌ని అన్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయానికి ఎలాంటి ఆస్కారం లేదని స్ప‌ష్టం చేశారు. అలాగే రాత్రికి రాత్రే.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను చేశామ‌న్నది అవాస్త‌వం అని అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. అలాగే వంగ‌వీటి రంగా పేరున జిల్లా అంటే.. స్థానికుల కోరిక మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news