సాయిపల్లవికి అవమానం.. తెలంగాణ గవర్నర్‌ సీరియస్‌ !

-

హీరో నాని, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. ఈ సినిమాలో దేవదాసిగా నటించిన సాయి పల్లవిని కొందరు బాడీ షేమింగ్‌ చేయడంపై తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ స్పందించారు. ఓ తమిళ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను తెలిపారు.

”ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడటం నన్ను తీవ్రంగా బాధ పెట్టింది. పొట్టిగా ఉంది. నల్లగా ఉందంటూ మహిళలను పలువురు కించపరుస్తూ ఉంటారు. ఆ వ్యాఖ్యలు సంబంధితుల మనసును గాయపరుస్తాయని ఆలోచించరు. నేనూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను. నన్ను చింపిరి జుట్టు అని అనేవారు. కఠినమైన కృషి, ప్రతిభతో వాటిని దాటుకుని ధైర్యంగా ఎదిగాను. ఏదైనా అందమే. అందుకే కాకిపిల్ల కాకికి ముద్దు అనే సామెత వచ్చింది. సమాజాంలో ఎక్కువగా స్త్రీలే బాడీ షేమింగ్‌ కు గురవుతున్నారు” అంటూ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పట్ల అందరూ గౌరవంగా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news