మృత్యువునే జయించిన వ్యక్తి.. ఏడుసార్లు చావును తప్పించుకున్నాడు..!

-

కొంతమంది మృత్యువును జయిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. అది ఎంత పెద్ద ప్రమాదమైనా కొంతమంది బతికి బయటపడతారు. చిన్న దెబ్బ కూడా తాకకుండా వాళ్లు బతికి బయటపడటమంటే అది మృత్యువును జయించినట్టే కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి ఏకంగా ఏడు సార్లు చావును తప్పించుకున్నాడు. అది కూడా డేంజర్ ప్రమాదాల నుంచి బతికి బయటపడ్డాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత అదృష్టమైన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ఫ్రానే సెలాక్ అనే వ్యక్తి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది.

World's luckiest person who saved his life from dangerous problems

క్రొయేషియాలో జన్మించిన ఫ్రానే 1929 లో జన్మించాడు. అతడు పుట్టింది పేద కుటుంబంలో. ఎప్పుడూ తను దురదృష్టవంతుడంటూ తనలో తానే కుమిలిపోయేవాడు. కానీ.. అతడు ఏడు సార్లు జరిగిన ఘోర ప్రమాదాల్లో బతికి బయటపడ్డాడు.

1962లో ఏకంగా అతడు ప్రయాణిస్తున్న రైలు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. కానీ.. ఫ్రానే మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన చేయి మాత్రం విరిగింది.

1963… ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. 19 మంది చనిపోయారు. కానీ.. ఫ్రానే మాత్రం ఎగిరి గడ్డివాము మీద పడ్డాడు.

1966.. ఆయన ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. నలుగురు చనిపోయారు. ఫ్రానేకు మాత్రం ఏంకాలేదు.

1970.. ఫ్రానే ప్రయాణిస్తున్న కారుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఫ్రానే కారు నుంచి కిందికి దూకాడు. తర్వాత కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

1973.. సేమ్ కారు మంటల్లో చిక్కుకుంది. కానీ.. ఫ్రానే తప్పించుకున్నాడు.

1995.. ఫ్రానేను బస్సు ఢీకొట్టింది. కానీ.. మనోడికి ఏం కాలేదు.

1966.. మనోడు ప్రయాణిస్తున్న కారు 300 ఫీట్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది. అయితే.. కారు లోయలో పడిపోతున్నప్పుడే… కారు నుంచి బయటకు దూకాడు. చెట్టును పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు.

అలా ఏడుసార్లు డేంజర్ ప్రమాదాల నుంచి బయటపడిన ఫ్రానే… 10 మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్నాడు. అంటే మన కరెన్సీలో 6,94,79,000 రూపాయలు. దీంతో మనోడి జీవితమే మారిపోయింది వెంటనే మాంచి ఇల్లు కొనుక్కున్నాడు. మరో పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్నాడు. నువ్వు నిజంగా లక్కీయెస్ట్ పర్సన్ వి పో.

Read more RELATED
Recommended to you

Latest news