హహహ.. మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ.. ఫన్నీ వీడియో

రొటీన్ వార్తలు చదివి బోర్ కొడుతోందా? అయితే ఈ వీడియో చూసి కాసేపు నవ్వుకోండి.. సరదా వీడియో

ఇది ఎన్నికల సీజన్ కదా. ఇప్పుడు దేశమంతా ఎన్నికలపైనే చర్చ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇప్పుడు ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ కాగా.. మరొకరు రాహుల్ గాంధీ. వచ్చే ఎన్నికల్లోనూ వీళ్లే ప్రధాన మంత్రి అభ్యర్థులు. దీంతో దేశ ప్రజలు కూడా వీళ్ల గురించే చర్చిస్తున్నారు. అఫ్ కోర్స్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొన్ని పార్టీలు అంటున్నాయి. అది వేరే విషయం. కానీ.. మెయిన్ ఫోకస్ మాత్రం ఇప్పుడు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మీదే.

ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని అభ్యర్థుల మీద సెటైర్లు రావడం వాటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించడం అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఫన్నీ సంఘటనను మోదీ, రాహుల్ కు అనువదించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఓసారి ఈ వీడియో చూడండి. ఇది జస్ట్ ఫన్నీ వీడియో మాత్రమే.. ఇది ఎవరినీ ఉద్దేశించింది కాదు. కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే అని గమనించగలరు.