ఫ్యాక్ట్ చెక్: బొప్పాయి పండ్లు రోడ్డు మీద పెట్టి ఆర్టీసీ బస్సుకి అడ్డంగా నిరసన చేసిన రైతు అనొచ్చిన వార్తలో నిజం ఎంత..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా రైతు గోపయ్య వార్త ఒకటి వచ్చింది. బస్సు కొల్లాపూర్ నుంచి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్లను పెట్టి ఒక గంట పాటు అక్కడే కూర్చుని బస్సు కదలకుండా నిరసన చేశాడు రైతు. అయితే నిజంగా బస్సు డ్రైవర్ ఫ్రీగా బొప్పాయి పండ్లు అడిగాడా..? పండ్లు రైతు ఇవ్వలేదన్న కోపంతో బస్సు డ్రైవర్ బస్సు ఎక్కించుకో లేదా..? అందుకే గోపయ్య నిరసన చేశాడా..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రతి రోజు గోపయ్య బొప్పాయి పండ్లు గ్రామం నుంచి కొల్లాపూర్ పట్టణానికి తీసుకు వెళ్లి అమ్ముకోవడం అనేది వాస్తవం. అయితే ఉచితంగా బస్సు డ్రైవర్ పండ్లు అడిగాడని ఇవ్వలేదన్న కోపంతో బస్సు ఎక్కించుకో లేదని చెప్పాడు. అందుకే నిరసన చేస్తున్నట్లు వ్యక్తపరిచాడు. ఈ వార్తల్లో నిజం లేదని అచ్చంపేట బస్ డిపో మేనేజర్ నాగర్ కర్నూలు జిల్లా ప్రెస్ లోకల్ మీడియా ప్రతినిధులకు ఒక ప్రకటనను విడుదల చేశారు.

బొప్పాయి పండ్లు ఫ్రీగా డ్రైవర్ అడగ లేదని అయితే బొప్పాయి పండ్లను మాత్రమే తీసుకు వెళ్లాలని.. తాను రానని చెప్పాడని అక్కడ బొప్పాయి పండ్లని మరొక వ్యక్తి దించుకుంటారని చెప్పాడు గోపయ్య. దానికి డ్రైవర్ ఒప్పుకోలేదు. ఇందుకే గోపయ్య నిరసన చేశాడు. కానీ బొప్పాయి పండ్లు ఇవ్వలేదని డ్రైవర్ తిరస్కరించాడని అన్నాడు గోపయ్య.

Read more RELATED
Recommended to you

Latest news