దమ్ము ధైర్యం ఉంటే.. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఇంటి ముందు చంద్రబాబు దీక్ష చేయాలి : రోజా

-

దమ్ము ధైర్యం ఉంటే.. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఇంటి ముందు చంద్రబాబు దీక్ష చేయాలని.. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. వినోద్ జైన్ వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక సూసైడ్ చేసుకున్నది వింటుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్లకు పైబడి, ప్రజాప్రతినిధిగా పోటీ చేసిన వ్యక్తి 14 ఏళ్ల బిడ్డని తండ్రిలా చూడాల్సింది పోయి ఇలా సెక్సువల్గా ఏరాస్ చేయడం చాలా దారుణమని ఫైర్ అయ్యారు.

ఇటువంటి రాక్షసులకు బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలన్నారు. చంద్రబాబు హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఎంతో మంది మహిళలను వ్యభిచార కూపంలోకి దించారని అగ్రహించారు. ఇవి అడిగిన నన్ను రూల్స్ విరుద్ధంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.. అలాంటి దొంగలు రేపు నారీ సంకల్ప దీక్షను ఎలా చేస్తారు.. సిగ్గుండాలని మండిపడ్డారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే సూసైడ్ చేసుకుని చనిపోయిన బాలిక ఇంటిముందు కూర్చుని చేయండి అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలోనని సవాల్ విసిరారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news