తెలంగాణలో త్వరలోనే రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం..3 వేల మందికి ఉద్యోగాలు

-

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఎన్నో ఇంటర్‌ నేషనల్‌ కంపెనీలు.. హైదరాబాద్‌ వస్తుండటంతో..చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా.. లోకోమెటివ్స్‌ కోసం హై టెక్‌ ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌ చేసి.. తయారు చేసే మేథా సర్వో డ్రైవ్స్‌ హైదరాబాద్‌ సమీపంలోని కొండకల్‌ లో రూ.1000 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ సెక్టార్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ అవుతుందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ లో మేధా గ్రూప్‌ నెలకొల్పిన ప్రైవేట్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్‌ రైల్ కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఇది ఒకటని కేటీఆర్‌ చెప్పారు. త్వరలోనే రైల్‌ కోచ్‌ ల తయారీ, రవాణకు సిద్దమవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. తెలంగాణో రైల్‌ కోచ్‌ ల తయారీని సుసాధ్యం చేసిన మేధా బృందాన్ని అభినందిస్తూ.. రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ షేర్‌ చేశారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 3వేలకు పైగా ఉద్యోగాలు లభించే ఛాన్స్‌ ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news