ఏపీలో దారుణం.. మహిళపై భర్త లైంగిక దాడి.. వీడియో తీసిన భార్య

-

విజయవాడ లో దారుణం చోటుచేసుకుంది. కళ్ళ ముందే భర్త ఓ మహిళపై లైంగిక దాడి చేయడాన్ని అడ్డుకోవాల్సిoది పోయి… ఆ వీడియోను తీసి ఓ భార్య అరాచకానికి తెర లేపింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… విజయవాడకు చెందిన ఓ వివాహిత భర్త కేటరింగ్ పని చేస్తూ ఉంటాడు. ఈ నెల 3వ తేదీన రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది.

వీరు ఎదురింట్లో దిలీప్, తులసి అనే భార్య భర్తలు ఉంటున్నారు. అయితే 11 గంటల సమయంలో ఆ మహిళ ఇంట్లోకి వారు అక్రమంగా ప్రవేశించారు. వివాహిత నోరు మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై భర్త రెండుసార్లు లైంగిక దాడి చేయగా… ఆ దుర్మార్గాన్ని అతడి భార్య వీడియో, ఫోటోలు కూడా తీసింది. ఆ తర్వాత రోజు కూడా ఆమె ను బెదిరించి లైంగిక దాడి చేశారు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ పిల్లలిద్దరినీ చంపేస్తామని… ఫోటోలను అందరికీ చూపించి పరువు తీస్తాo అని బెదిరించారు. అయినప్పటికీ ఆ మహిళ ధైర్యం చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news