మీరు ఏ అమ్మాయిని అయినా ఇష్టపడ్డారా..? ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రొపోజ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే కాస్త కొత్తగా ప్రపోజ్ చేయాలనే ఆలోచనలో మీరు ఉంటే ఈ ఐడియాస్ మీకోసం.
చాలామంది ప్రపోజ్ చేయడానికి కొత్త పద్ధతిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే రొటీన్ గా కాకుండా కాస్త భిన్నంగా ప్రపోజ్ ఇస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. అయితే కచ్చితంగా ఆ అమ్మాయి ఫిదా అయిపోవాలంటే ఇలా ప్రపోజ్ చేసి చూడండి.
డిన్నర్ కి తీసుకెళ్ళి తను ఎంత స్పెషల్ ఓ తెలియజేయండి:
ఆమెకి నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసి.. ఆమెకి మీ యొక్క ప్రేమను చూపించండి. అలానే మీకు ఆమె ఎంత స్పెషల్ ఓ మీరు ఆమెకి చూపించండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఫిదా అవుతారు. ఆ తర్వాత మీరు ప్రపోజ్ చేయొచ్చు.
సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో బీచ్ కి తీసుకు వెళ్ళండి:
కార్ లో కాస్త మంచి మ్యూజిక్ ని పెట్టి ఆమెతో నెమ్మదిగా మాట్లాడుతూ ఆమెని సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి బీచ్ కి తీసుకు వెళ్ళండి. ఆ తర్వాత ఆమెకు మీ యొక్క ప్రేమను తెలపండి.
మీరు మీరుగా ఉండండి:
అన్నిటికంటే ఇది చాలా ముఖ్యం. మీరు మీలా వుంది ఆమెకి ప్రపోజ్ చేయండి. అయితే మీరు చాలా సింపుల్ గా స్వీట్ గా ఉండాలి. ఇది చాలా ముఖ్యం.
మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేయండి:
ఇది చాలా పాత పద్ధతి అయినా సరే తను మనిషి ఇలా మోకాళ్ళ మీద నిలబడి ప్రపోజ్ చేయడం అంటే అమ్మాయిలకు ఇష్టం. ఇలా మీరు ఒక రెడ్ రోజ్ తో ఆమెకి ప్రపోజ్ చెయ్యండి. ఇలా చేస్తే కూడా కచ్చితంగా ఆమె ఫిదా అయిపోతుంది.