మూడు గంట‌ల్లో పెళ్లి.. అంత‌లోనే వ‌రుడు మృతి

-

మూడు గంట‌ల‌లో పెళ్లి మూహ‌ర్తం.. పెళ్లి చేసుకోవ‌డానికి వ‌రుడు కారులో పెళ్లి మండ‌పానికి వెళ్తున్నాడు. కారులో వెళ్తుండగా వ‌రుడు కారుకు ప్ర‌మాదం.. మృతి. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పట్ట‌ణంలోని క్రిస్టియన్ ప‌ల్లికి చెందిన భువ‌నాల చైత‌న్య కుమార్ (35) నారాయ‌ణ పేట జిల్లాలోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవ‌ల చైత‌న్య కుమార్ కు వ‌న‌ప‌ర్తికి చెందిన ఒక అమ్మాయితో పెళ్లి కుదిరింది. గురు వారం ఉద‌యం 11 గంట‌ల‌కు చైత‌న్య కుమార్ వివాహం జ‌ర‌గాల్సి ఉంది.

మూహ‌ర్తం కూడా ఫిక్స్ చేశారు. జ‌డ్చ‌ర్లో పెళ్లికి ఏర్పాట్లును కూడా చేశారు. కాగ గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు చైత‌న్య కుమార్ కారు లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని క్రిస్టియన్ ప‌ల్లి నుంచి జ‌డ్చ‌ర్ల‌లోని పెళ్లి మండ‌పానికి బ‌య‌లు దేరాడు. మార్గ మ‌ధ్యలో న‌క్క‌ల బండా తండా వ‌ద్ద మ‌లుపు వ‌ద్ద కారు అదుపు త‌ప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో చైత‌న్య త‌ల‌కు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో చైత‌న్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మూడు గంట‌ల‌లో పెళ్లి మూహ‌ర్తం ఉండ‌గా.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో బంధువులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news