తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్‌ శుభవార్త..భారీగా పెరగనున్న జీతాలు

-

తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతాయని ప్రకటన చేశారు. గత 7 ఏళ్లుగా పని చేసిన మాదిరిగానే.. ముందు ముందు కూడా ఉద్యోగులు పని చేస్తే.. జీతాలు కూడా అవే పెరుగుతాయని చెప్పారు. ఇవాళ జనగామ జిల్లాలో నూతన కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఇక ముందు అస్సలు కరెంటు పోదన్నారు.తాము తీసుకు వచ్చిన జోన‌ల్ వ్య‌వ‌స్థ‌తో అంద‌రికీ న్యాయం జరుగుతుందని చెప్పారు సీఎం కేసీఆర్‌. అవ‌గాహ‌న లేక కొంద‌రు వ్య‌తిరేకించారని మండిపడ్డారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నారని.. తెలంగాణ‌లో క‌రెంట్ పోదని తేల్చి చెప్పారు. దేశంలో 10 గ్రామాల‌కు అవార్డులు వ‌స్తే అందులో ఏడు గ్రామాలు మ‌న‌వేనని కొనియాడారు. ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తేనే ఇదంతా సాధ్యం అయిందని కేసీఆర్‌ ప్రకటనచ చేశారు.తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తాము పని చేస్తామని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news