రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. ఇళ్ల స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు మ‌రో ఛాన్స్

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇళ్ల స్థలాల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించుకోని వాళ్లు చివ‌రి అవ‌కాశం గా స‌మ‌యం కేటాయించింది. ప్ర‌భుత్వ భూముల‌లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థ‌లాలను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించుకోవ‌డానికి తెలంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది. ఈ నెల 21 వ తేదీ నుంచి మార్చి ఆఖ‌రు వ‌ర‌కు ప్ర‌భుత్వ భూముల‌లో ఇళ్లు నిర్మించుకున్న వారు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం ద‌ర‌ఖ‌స్తులు చేసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుర్తింపు గ‌ల మీ సేవా కేంద్రాల ద్వారా ఇళ్ల స్థ‌లాల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిణ చేయ‌డానికి ద‌రఖాస్తు చేసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది. కాగ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌తంలో ఉచితంగా క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేసింది. జీవో నెంబ‌ర్లు 58. 59 ప్ర‌కారం రాష్ట్ర వ్యాప్తంగా 125 చ‌ద‌ర‌పు గ‌జాల ల్లోపు గల ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచితంగా క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేసింది. తాజా గా మ‌రోసారి ఇళ్ల స్థ‌లాల క్ర‌బ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు మ‌రో అవ‌కాశం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news