భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పంజాబ్ రాష్ట్రంలో మరో సారి చేదు అనుభవం ఎదురు అయింది. పంజాబ్ రాష్ట్ర అధికారులు, పోలీసుల వైఫల్యం వల్ల తాను ఒక దేవాలయాన్ని దర్శించుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాగ పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు వచ్చారు. బహిరంగ సభకు వెళ్లే ముందు.. జలంధర్ లోని దేవీ తలాబ్ దేవాలయానికి వెళ్లాలని ప్రధాని మోడీ ప్రయత్నించారు.
కానీ పంజాబ్ అధికారులు సరైనా ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆ జలంధర్ దేవీ తలాబ్ దేవాలయాన్ని సందర్శించకోకుండానే ప్రధాని మోడీ వెనుతిరిగారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రస్తావించారు. మళ్లీ వచ్చి.. దేవీ తలాబ్ దర్శనాన్ని తీసుకుంటానని ప్రధాని అన్నారు. కాగ ఇటీవల ఫిరోజ్ పుర్ లో ప్రధాని మోడీ పర్యటించిన సమయంలో భద్రతా లోపం జరిగిన విషయం తెలిసిందే. భద్రతా లోపం దేశ వ్యాప్తంగా కొన్ని రోజుల పాటు వివాదాలు జరిగాయి.