సమతా మూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు 12 రోజుల పాటు అట్టహాసంగా సాగాయి. ఈ ఉత్సవాలను దేశం నలుమూల నుంచి వేల సంఖ్య భక్తులు వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు తో పాటు పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, సినీ ప్రముఖులు కూడా సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ దగ్గర ఉండి మరి.. ఈ ఉత్సవాలను జరిపించారు. ఈ వేడుకలలో 216 అడుగుల సమతా మూర్తి రామానుజార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే 54 అంగులాల సమతా మూర్తి స్వర్ణ విగ్రహానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. లోకార్పణం చేశారు. అలాగే దేశంలో ఉన్న 108 గొప్ప గొప్ప ఆలయాల నమూనాను ప్రాణప్రతిష్ట చేశారు. కాగ ఈ నెల 19న కళ్యాణం నిర్వహిస్తామని చిన్న జీయర్ స్వామి తెలిపారు. సహస్రాబ్ది వేడుకల్లోనే కళ్యాణం జరిపించాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఈ నెల 19న అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి సిద్దం అవుతున్నారు.