చెత్తతో వస్తువులు తయారుచేసే వారు ఈరోజుల్లో చాలామందే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వేస్ట్ మెటీరియల్ తో ఆర్ట్స్ చేసి..పబ్లిక్ ప్లేస్ లో పెడుతున్నాయి. ఒడిశాలో ని ఓ కుర్రాడు అగ్గిపుల్లలతో కళాఖండాలు చేస్తున్నాడు. మన తెలంగాణలోని సిరిసిల్లలో అగ్గిపెట్టెలో పట్టేంత సన్నటి చీరను అల్లుతారు. ఇలా ఎంతో మంది కళాకారులకు ఎంతో గొప్ప టాలెంట్ ఉంటుంది. అలాంటి ఓ ఆర్టిస్ట్… చెత్తతో పక్షుల బొమ్మలు చేస్తున్నారు. వాటిని మనం తిన్నగా చూస్తే పక్షిలా కనిపిస్తాయి. అదే పక్కనుంచి చూస్తే చెత్తలా కనిపిస్తాయి.
అతని పేరు థామస్ డీనింగర్ వృత్తి రీత్యా ఆర్టిస్ట్. పారేసే చెత్తను క్రియేటివ్ గా ఉపయోగిస్తూ… బొమ్మలు చెయ్యడం అతనిలో ఉన్న ప్రత్యేకత. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో tdeininger అనే పేజీలో..తాను తయారుచేసే కళాఖండాల వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడు. అతని ఆర్ట్ వీడియోలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అతని టాలెంట్ మనల్ని నమ్మలేని విధంగా మార్చేస్తుంది.
థామస్ కి పక్షులంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి పక్షుల్ని చూస్తూ పెరిగిన తనకు….వ్యర్థాలతో పక్షుల బొమ్మలు చెయ్యడాన్ని ఓ ప్రాజెక్టుగా చేపట్టాడు. “బర్డ్స్ ఆర్ నాట్ రియల్” పేరుతో ఇదో ఉద్యమంలా మొదలుపెట్టాడు.
ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే… ప్లాస్టిక్ చెత్తను ఎక్కడబడితే అక్కడ పడేస్తే… అది భూమిలో కరగకుండా…చివరకు సముద్రాల్లో కలుస్తోంది. ఇలా ఏటా సముద్రాల్లో లక్షల టన్నుల చెత్త పేరుకుపోతోంది. అందువల్ల ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఇలా బొమ్మలు చెయ్యడం ద్వారా చాలా వరకూ కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నదే థామస్ ఆలోచన. తన ప్రాజెక్టును ఎగ్జిబిషన్ రూపంలో అమెరికాలో ప్రదర్శిస్తున్నాడు థామస్. వచ్చే వారం తాను లాస్ ఏంజిల్స్ లో కొన్ని కళాఖండాలను ప్రదర్శిస్తానని తెలిపాడు.
https://instagram.com/tdeininger?utm_medium=copy_link
View this post on Instagram
View this post on Instagram