దేశభక్తుడు అయిన కేసీఆర్ మరో దేశ భక్తుడు అయిన ఉద్ధవ్ ఠాక్రే (శివసేన)తో కలిసి రాజకీయం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరేందుకు అవకాశాలున్నాయి.ఒకవేళ కేసీఆర్ జాతీయ పార్టీ అనౌన్స్ చేసి ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేసినా అందులో కూడా ముంబయి పెద్ద శివసేన ఉండనుంది.ఈ దిశగా ఇప్పటికే కొన్ని కీలక చర్చలు జరిగాయి అని కూడా తెలుస్తోంది.అదేవిధంగా మమతాబెనర్జీ (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి)తోనూ కేసీఆర్ చర్చలు జరపనున్నారు.
వాస్తవానికి ముంబయి కేంద్రంగా పనిచేసే శివసేన ఏనాటి నుంచో బీజేపీతో మంచి బంధాలు కొనసాగించింది.కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ బంధం విరిగిపోయింది.ప్రధాని మోడీని టార్గెట్ గా చేసుకుని సొంత పత్రిక సామ్నాలో సంపాదకీయాలు కూడా వెలువరించింది.దీంతో బీజేపీకి,శివసేనకు మధ్య బంధం తెగి పోయింది.ఇదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు. కానీ అందుకు తగ్గ ప్రత్యామ్నాయ మార్గాలేవీ గడిచిన ఏడేళ్లలో ఆయనకు దొరకలేదు.దీంతో కేసీఆర్ తో దోస్తీ చేసి తదనంతరం బీజేపీ అంతు చూడాలని శివసేన ఉవ్విళ్లూరుతోంది.ముంబయిలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో పనిచేసిన బీజేపీ నేతలను ఘోరంగా ఓడించాక శివసేన మరింత బలపడింది.
ఇదే సమయంలో సినిమా హీరోయిన్ కంగనా రనౌత్ పై కూడా కొన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. బీజేపీకి మద్దతిస్తున్న ఆమె ఆస్తులను సైతం ముంబయిలో ధ్వంసం చేసింది.దీంతో బీజేపీకి,శివసేనకు మరింత దూరం పెరిగింది.తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన తో కలిసి కేసీఆర్ ఒక్కరే కాదు కుదిరితే జనసేన కూడా పనిచేయొచ్చు. ఉండవల్లి అన్న విధంగా రాజకీయాల్లో ఏమయినా జరగవచ్చు. చంద్రబాబు కూడా కొంత కాలం శివసేనకు అనుగుణంగానే ఉన్నారు.కనుక వీళ్లంతా కలిసి మోడీకి వ్యతిరేకంగా పనిచేయాలని, తిరుగులేని శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్నారు.